Wednesday, 21 November 2012

మనసే కలకలం

మనసే కలకలం దాని అదుపులే కీలకం.
మనుగడలే పదిలం పాటిస్తేనే ఈ మంత్రం. 
చరితలో నిలిచిన చంద్రులు తమలో చీకటిని తుంచేసారే .
లోక కళ్యాణమే తమ తమ ధ్యేయంగా శకము సాగించారు.
మార్గదర్శకం కాకపోదా వారి వారి జన జీవనము .
ప్రశాంతపు జీవితం కాదా మన సొంతము.
ప్రాపంచిక జ్ఞానమే తారసపడిపోదా నీకు.
తపనలే నీతోడై నిరంతర తపస్విగా మారిపోవా .
నువ్వు సైతం ప్రపంచాగ్నికి సమిధమైపోవా .
పరిపూర్ణ శక్తిగా సంఘ సంస్కర్తగా తయ్యారైపోవా.
నీ ముందు తరానికి చిరు కాంతులీనే దీపమైపోవా..


Buddha